బన్నీ సినిమా పై త్రివిక్రమ్ ప్లానింగ్

బన్నీ సినిమా పై త్రివిక్రమ్ ప్లానింగ్

Published on Feb 18, 2024 5:05 PM IST

‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే, ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, గుంటూరు కారం ఫలితం దెబ్బకు.. ఈ సినిమా స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నారట. అలాగే, ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి.. షూటింగ్ ను మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని.. అందుకే, మొత్తం సినిమాలోనే బన్నీ క్యారెక్టరే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివక్రమ్ మరోసారి జత కట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు