‘బన్నీ’ ఈ సారి తెలంగాణ నేపథ్యంలో ?

‘బన్నీ’ ఈ సారి తెలంగాణ నేపథ్యంలో ?

Published on Feb 26, 2024 7:00 AM IST

‘త్రివిక్రమ్ శ్రీనివాస్‌’ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ రాయలసీమ మాండలికంలో డైలాగులు పలికాడు. దాంతో బన్నీ డైలాగ్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయి. ఐతే, ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం తెలంగాణ మాండలికంలో బన్నీ డైలాగ్స్ చెప్పబోతున్నాడట.

గతంలో రుద్రమదేవి సినిమాలో బన్నీ తెలంగాణ మాండలికంలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పాడు. మళ్లీ త్రివిక్రమ్ సినిమా కోసం మరోసారి అదే మాండలికంలో డైలాగ్స్ పలకబోతున్నట్లు తెలుస్తోంది. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివక్రమ్ మరోసారి జత కట్టారు. ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు