షూటింగ్ కి బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య

షూటింగ్ కి బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య

Published on Feb 25, 2024 8:09 PM IST


నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్‌ ఫిల్మ్‌ గా తెరకెక్కుతోంది. అయితే, ఏపీలో ఎలక్షన్ టైమ్ వచ్చేసింది. ప్రస్తుతం బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే, బాలకృష్ణ రాజకీయాల కోసం సినిమాలకు విరామం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంపై బాలయ్య పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతున్నారని తెలుస్తోంది.

టీడీపీ-జనసేన కూటమి గెలుపు కోసం బాలయ్య బాబు తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వబోతున్నారు. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు