బాలయ్యతో తమన్నా స్పెషల్ సాంగ్ ?

బాలయ్యతో తమన్నా స్పెషల్ సాంగ్ ?

Published on Feb 26, 2024 9:39 PM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పుడు ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారని తెలుస్తోంది. మరి, ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే హీరోయిన్ తమన్నా చేత ఈ స్పెషల్ సాంగ్ ను చేయిస్తారని టాక్. ‘జైలర్’లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. మరి ఇప్పుడు బాలయ్య సరసన కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తే అదిరిపోతుంది.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. అన్నట్టు ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు