ఆగస్టు నుంచి ‘అఖండ 2’ మొదలు ?

ఆగస్టు నుంచి ‘అఖండ 2’ మొదలు ?

Published on Dec 5, 2023 2:29 AM IST

బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌ లో వచ్చిన అఖండ అఖండమైన విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ‘అఖండ 2’ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? లాంటి విషయాల పై ఇంకా క్లారిటీ లేదు. ఐతే, తాజాగా బోయపాటి శ్రీను ‘అఖండ 2’ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని.. వచ్చే ఆగస్టు లో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని టాక్.

అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య – దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ‘అఖండ 2’ సినిమా రాబోతుందని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు