‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Jan 30, 2024 6:33 PM IST

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? లాంటి విషయాల పై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తోంది. ముందుగా బాలయ్య పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని టాక్ నడుస్తోంది. అన్నట్టు అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. 6

అందుకే, ‘అఖండ 2’ సినిమా పై నార్త్ లో కూడా బజ్ ఉంటుంది అని టాక్. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు