మనోజ్ ‘డేవిడ్‌ రెడ్డి’ సినిమా పై కొత్త అప్ డేట్ !

మనోజ్ ‘డేవిడ్‌ రెడ్డి’ సినిమా పై కొత్త అప్ డేట్ !

Published on Jul 27, 2026 5:00 PM IST

David-Reddy-1

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం క్లైమాక్స్ కోసం టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఓ సెట్ కూడా వేస్తున్నారు. మనోజ్ కూడా తన కొత్త లుక్ కోసం కసరత్తులు చేశాడు. అలాగే ఈ క్లైమాక్స్ కోసం మనోజ్ భారీ యాక్షన్ సీన్స్ ను కూడా షూట్ చేయనున్నారు. మరోవైపు టీమ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది. .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు