మరో తెలుగు సినిమాకి ధనుష్ గ్రీన్ సిగ్నల్

మరో తెలుగు సినిమాకి ధనుష్ గ్రీన్ సిగ్నల్

Published on Apr 22, 2024 11:32 PM IST

‘శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ‘శ్రీకారం’ అనే సినిమా తీశాడు దర్శకుడు కిషోర్ బి. ఐతే, తాజాగా తమిళ హీరో ధనుష్ తో కిషోర్ బి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ధనుష్ కి కిషోర్ బి ఓ కథ చెప్పాడని, ధనుష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఇక ఈ సినిమా ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి.. షూటింగ్ ను మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ధనుష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా ధనుష్ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని.. అందుకే, మొత్తం సినిమాలోనే ధనుష్ క్యారెక్టరే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

కాగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తన బ్యానర్ లో నిర్మించనున్నారు. మరి ధనుష్ ఇమేజ్ కోసం కిషోర్ బి ఎలాంటి కథ రాశాడో చూడాలి. నిజానికి కిషోర్ బి, నితిన్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ధనుష్ ఈ సినిమాకి ఓకే చెప్పడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ కాంబినేషన్ ను దిల్ రాజే లైన్ లో పెట్టినట్లు టాక్. ధనుష్ తన కొత్త ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు