గోపీచంద్ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

గోపీచంద్ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Feb 12, 2024 5:05 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హిమాలయాల్లో జరిగింది. ఐతే, తర్వాత షెడ్యూల్ ను ఒంగోలు ప్రాంతంలో చేస్తున్నట్లు టాక్. ఈ షెడ్యూల్ లో గోపీచంద్ తో సహా ఇతర ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. అలాగే, ఈ షెడ్యూల్ లో గోపీచంద్ పై ఓ యాక్షన్ సీన్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ డ్యూయల్ రోల్‌‌ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ప్లాన్ చేస్తున్నాడని.. డ్యూయల్ రోల్ మధ్యలో వచ్చే కన్ ఫ్యూజ్ డ్రామా ఫుల్ ఫన్ తో సాగుతుందని తెలుస్తోంది. ఎలాగూ కామెడీ క్రియేషన్ లో శ్రీను వైట్లకి మంచి పేరు ఉంది. అందుకే, ఈ సినిమాలో కూడా కామెడీ అదిరిపోతోంది అని అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు