‘గుంటూరు కారం’ పైనే శ్రీలీల ఆశలన్నీ !

‘గుంటూరు కారం’ పైనే శ్రీలీల ఆశలన్నీ !

Published on Dec 11, 2023 12:00 AM IST

స్కంద‌, ఆదికేశ‌వ‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాలు శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ను పెంచ‌క‌పోగా, త‌గ్గించాయి. అందుకే, మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ గుంటూరు కారం సినిమా పైనే శ్రీలీల త‌న ఆశ‌ల‌ను పెట్టుకుంది. మరి గుంటూరు కారం సినిమా శ్రీలీల‌కు ఏ రేంజ్ హిట్ ను అందిస్తోందో చూడాలి. ఇక ఈ సినిమా యాక్షన్ జోన‌ర్‌ లో న‌డిచే క‌థ అయినప్పటికీ.. కామెడీ ట్రాక్ కూడా హిలేరియ‌స్‌ గా ఉంటుందట.

ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌న‌వ‌రి 12, 2024న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందట. కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు