‘వార్ 2’ కోసం భారీ యాక్షన్ సెట్

‘వార్ 2’ కోసం భారీ యాక్షన్ సెట్

Published on Apr 28, 2024 7:41 PM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ ఎన్టీఆర్ – హృతిక్ పాత్రలతోనే స్టార్ట్ అవుతుందని టాక్. మే రెండో వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారని టాక్. ఏది ఏమైనా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు