‘వార్ 2’లో మరో సౌత్ హీరో ?

‘వార్ 2’లో మరో సౌత్ హీరో ?

Published on May 25, 2024 6:00 PM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ఇప్పుడు మరో సౌత్ హీరో కూడా కనిపించబోతునట్లు తెలుస్తోంది. కన్నడ హీరో ధృవ్ సర్జా కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నాడని.. ఎన్టీఆర్ కి తమ్ముడి పాత్రలో ధృవ్ నటిస్తున్నాడు అని టాక్. కొన్ని సీన్స్ లో మాత్రమే ధృవ్ పాత్ర ఉంటుందని.. తన తమ్ముడి చావు కోసం తారక్ ఏం చేశాడు? అనే కోణంలో ఈ కథ సాగుతుందట. మరి ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందో చూడాలి.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు