‘జెంజ్ బ్యాచ్’ కోసం కీలక పాత్రలో దర్శకుడు ?

విభిన్న చిత్రాల దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడు పూర్తిగా కొత్త నటీనటులతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ జరిగింది. ఐతే, ఈ సినిమాలో దర్శకుడు క్రిష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలకం అని తెలుస్తోంది. మొదట దర్శకుడు గౌతమ్ మీనన్ చేత చేయించాలని అనుకునప్పటికి.. చివరకు క్రిష్ ఈ పాత్ర చేశారు.

ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని.. కథే ప్రధాన బలంగా ఉండేలా క్రిష్ స్క్రిప్ట్‌ను రూపొందించారని, సినిమాని కూడా అంతే బలంగా తీశారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాకి జెంజ్ బ్యాచ్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పైగా ఈసారి కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నిజానికి స్టార్ హీరోల కంటే కథను నమ్మే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు ఉంది. అందుకే, మరోసారి కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ తో క్రిష్ హిట్ కొడతారా ? లేక, ఎప్పటిలాగే పేరు మాత్రమే వస్తోందా ? అనేది చూడాలి.

Exit mobile version