‘భ‌క్త క‌న్న‌ప్ప‌’లో హాస్యం కూడా !

‘భ‌క్త క‌న్న‌ప్ప‌’లో హాస్యం కూడా !

Published on Mar 24, 2024 10:04 PM IST

‘మంచు విష్ణు’ తాజాగా చేస్తున్న సినిమా ‘భ‌క్త క‌న్న‌ప్ప‌’. ఐతే, భ‌క్త క‌న్న‌ప్ప‌ అంటేనే.. బావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి. ఐతే, ‘భ‌క్త క‌న్న‌ప్ప‌’ సినిమాలో హాస్యం కూడా ఉండబోతుంది. కన్నప్ప తన భక్తిని చూపించే క్రమంలో చేసే చర్యలు హాస్యభరితంగా ఉంటాయని, అమాయకత్వంతో నడిచే పాత్రల మధ్య ట్రాక్స్ కూడా ‘భ‌క్త క‌న్న‌ప్ప‌’ సినిమాలో ఎంటర్ టైన్ గా ఉంటాయని తెలుస్తోంది.

కాగా పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే చాలామంది స్టార్స్ అతిధి పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ మహా శివునిగా కనిపించనున్నాడని, అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార కనిపించనుందని టాక్. అలాగే మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నాడని, ఆదివాసీ తెగ‌కు సంబంధించిన ఒక పాత్ర‌లో మోహ‌న్‌లాల్ మెర‌వ‌నున్నాడని టాక్. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నాడట. మొత్తానికి ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు