‘బాబీ డియోల్’ కోసం భారీ సెట్ ?

‘బాబీ డియోల్’ కోసం భారీ సెట్ ?

Published on Mar 31, 2024 6:04 PM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ విలన్ బాబీ డియోల్ పాత్రతోనే స్టార్ట్ అవుతుంది అని టాక్. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అన్నట్టు ఏప్రిల్ రెండో వారం నుంచి బాలయ్య – బాబీ డియోల్ ల పై యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయని ఇప్పటికే దర్శకుడు బాబీ చెప్పాడు. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు