మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్లారిటీ

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్లారిటీ

Published on May 29, 2024 8:01 AM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదలకి ముందస్తు వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ, మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా అబ్బాయి మోక్షు కూడా పరిశ్రమకి రావాలి. తను కూడా విష్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా’ అని బాలయ్య చెప్పారు.

అదేవిధంగా మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి స్పందిస్తూ.. ‘తపన ఉన్న నిర్మాత వంశీ. మరో మంచి కలయిక ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం’ అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. మొత్తమ్మీద ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా మొదలు కానుంది. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా తన ఫిజిక్ పై కఠినంగా వర్కౌట్స్ చేస్తున్నాడు.రీసెంట్ గా వైరల్ అయిన పిక్ లో కూడా మోక్షజ్ఞ చాలా ఫిట్‌గా మారిపోయి కనిపించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు