‘దేవర’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్ డేట్

‘దేవర’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్ డేట్

Published on May 27, 2024 9:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ పాత్రల మధ్య క్రేజీ ఫైట్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేస్తారని టాక్. ఏది ఏమైనా ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు కొరటాల శివ. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే, ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు