‘దేవర’లో శ్రద్ధా కపూర్.. నిజమేనా ?

‘దేవర’లో శ్రద్ధా కపూర్.. నిజమేనా ?

Published on Mar 4, 2024 9:36 PM IST

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఓ స్పెషల్ పాత్రలో కనిపించబోతుంది అంటూ.. దేవర పార్ట్ 1 క్లైమాక్స్ లో ‘శ్రద్ధా కపూర్’ పాత్ర రివీల్ అవుతుంది అని, దేవర పార్ట్ 2లో శ్రద్ధా కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజం అయితే.. శ్రద్ధా కపూర్ కి మరో క్రేజీ సినిమా దక్కినట్టే.

కాగా ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ – సైఫ్ అలీఖాన్ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతుంది. దీనికితోడు, ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు