‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Dec 12, 2023 2:20 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ‘వార్ 2’ కి డేట్స్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. మరోపక్క ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ, ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, సలార్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు.

ఐతే, జనవరి నాలుగో వారం తర్వాత ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. 2025 సమ్మర్ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్తోంది అని తెలుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు