లేటెస్ట్ : ‘పుష్ప – 2’ మాత్రమే కాదు ‘కల్కి 2898’ కూడా తగ్గేదేలే

లేటెస్ట్ : ‘పుష్ప – 2’ మాత్రమే కాదు ‘కల్కి 2898’ కూడా తగ్గేదేలే

Published on Feb 21, 2024 10:02 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దీనిని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

ఇక మరోవైపు నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ రెండు మూవీస్ పై దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. విషయం ఏమిటంటే, పుష్ప 2 మూవీ కొన్ని కారణాల వలన విడుదల వాయిదా పడనుంది అంటూ ఇటీవల వార్తలు వైరల్ అవడంతో, ఒక్కసారిగా రియాక్ట్ అయిన మేకర్స్ ఏమాత్రం తగ్గేదేలే, తమ సినిమా తాము ప్రకటించిన డేట్ కి పక్కాగా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా ప్రభాస్ కల్కి మూవీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా రిలీజ్ ఆలస్యం కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో ఏమాత్రం వాస్తవం లేదు, తమ మూవీ ముందుగా ప్రకటించిన విధంగా మే 9న థియేటర్స్ లో ఉంటుందని మేకర్స్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా పుష్ప 2 తో పాటు కల్కి మేకర్స్ కూడా తగ్గేదేలే అని ప్రకటించారు. మరి ఈ రెండు క్రేజీ మూవీస్ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాయో చూడలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు