లేటెస్ట్: ప్రశాంత్ వర్మ, రణ్వీర్ భారీ ప్రాజెక్ట్ పై అధికారిక క్లారిటీ ఇదే

లేటెస్ట్: ప్రశాంత్ వర్మ, రణ్వీర్ భారీ ప్రాజెక్ట్ పై అధికారిక క్లారిటీ ఇదే

Published on May 30, 2024 11:37 AM IST


రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజీ కాంబినేషన్ లా సాలిడ్ బజ్ ని అందుకున్న కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే పాన్ ఇండియా హిట్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie) దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకా బాలీవుడ్ పవర్ హౌస్ రణ్వీర్ సింగ్ ల కాంబినేషన్ అని చెప్పాలి. వీరి నుంచి ఓ భారీ సినిమా వస్తుంది అని టాక్ రాగా దీనిపై ఎనలేని అంచనాలు సెట్ అయ్యాయి.

అయితే దీనిపై గత కొన్నాళ్ల నుంచి కొన్ని గాసిప్స్ వైరల్ గా మారుతుండగా అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అంశంపై ఇప్పుడు సినీ వర్గాల్లో అధికారిక క్లారిటీ తాజాగా వచ్చేసింది. మరి మేకర్స్ నుంచి వచ్చిన అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం ప్రశాంత్ వర్మ – రణ్వీర్ సింగ్ – మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందట.

ఇప్పటిలో ఈ కాంబినేషన్ లో సినిమా ఉండబోదు అని భవిష్యత్తులో కూడా ఉంటే ఉండవచ్చు అని తెలుస్తుంది. అయితే ఒకరి వర్క్ పట్ల ఒకరికి అపారమైన గౌరవం ఉన్నట్టుగా రణ్వీర్ మరియు ప్రశాంత్ లు చెప్పుకున్నట్టుగా ఈ ప్రెస్ నోట్ ద్వారా రివీల్ అయ్యింది. మరి మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతానికి సినిమా లేదు.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ “జై హనుమాన్” తదితర ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు