లేటెస్ట్..విజయ్ “వారసుడు” ఓటిటి డేట్ వచ్చేసింది.!

Published on Feb 17, 2023 1:00 pm IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “వారసుడు”. మా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లో మరియు వంశీ కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలవగా ఇప్పుడు ఈ సినిమా అవైటెడ్ ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టుగా మేకర్స్ లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రికార్డు ధరకి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఈ సినిమాని ఒరిజినల్ తమిళ్ సహా తెలుగు మరియు మళయాళం లో కలిపి ఈ ఫిబ్రవరి 22 నుంచి ప్రసారం కి తీసుకువస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి తెలుగులో ఇప్పటివరకు మిస్ అయ్యినవారు అయితే ఆరోజు నుంచి చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందించగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :