లేటెస్ట్ : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ డేట్ పై నిర్మాత మరోసారి క్లారిటీ

లేటెస్ట్ : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ డేట్ పై నిర్మాత మరోసారి క్లారిటీ

Published on Apr 4, 2024 3:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో దానయ్య నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర చేస్తున్న ఈమూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే చాలావరకు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ విషయమై తాజాగా అంజలి నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత దానయ్య మరొక్కసారి క్లారిటీ ఇచ్చారు. తాము ఇదివరకు ప్రకటించిన విధంగానే పక్కాగా ఓజి మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని, ప్రస్తుతం రాజకీయ పరంగా బిజీగా ఉన్న పవన్, అవి పూర్తి అయిన తరువాత ఓజి తదుపరి షెడ్యూల్లో జాయిన్ అవుతారని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు