లేటెస్ట్ : ‘గేమ్ ఛేంజర్’ నుండి పిక్స్ లీక్

లేటెస్ట్ : ‘గేమ్ ఛేంజర్’ నుండి పిక్స్ లీక్

Published on Feb 27, 2024 11:02 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి సెట్స్ నుండి రెండు పిక్స్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతున్నాయి.

నిజానికి గతంలో గేమ్ ఛేంజర్ నుండి పలు పిక్స్, వీడియోస్ కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ విధంగా మూవీ నుండి వరుసగా లీక్స్ అవుతుండడంతో చరణ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇకపైన మూవీ టీమ్ లీక్స్ విషయమై గట్టిగా జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే లీక్డ్ పిక్స్ ప్రచురించడం సరైంది కాదు కనుక మేము అవి యాడ్ చేయడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు