మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” (Peddi) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కరెక్ట్ టైం చూసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇలా ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ ఈ సాంగ్ ఈ సంక్రాంతి కానుకగా వదలాలి అని చూస్తున్నారట. పండుగ మూమెంట్స్ లో అయితే ఫ్యాన్స్ కి మరింత ట్రీట్ ఇచ్చేలా ఉంటుంది అని టాక్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. మరి ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
