లేటెస్ట్ : ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ ఇంట్రెస్టింగ్ బజ్

లేటెస్ట్ : ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ ఇంట్రెస్టింగ్ బజ్

Published on Feb 27, 2024 12:09 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్ సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ 2 తో పాటు హను రాఘవపూడి తో ఒక సినిమా కూడా చేయనున్నారు ప్రభాస్.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం తాజగా ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు