లేటెస్ట్.. “కల్కి 2898ఎడి” క్రేజీ ట్రీట్ తో రిలీజ్ డేట్?

లేటెస్ట్.. “కల్కి 2898ఎడి” క్రేజీ ట్రీట్ తో రిలీజ్ డేట్?

Published on Apr 20, 2024 4:15 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ లాటి దిగ్గజ నటులతో దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న భారీ చిత్రం “కల్కి 2898ఎడి” (Kalki 2898AD Release). మరి ఎన్నో అంచనాలు నడుమ ఉన్న ఈ సినిమా వరల్డ్ లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్ గా నిలిచిపోగా మేకర్స్ రీసెంట్ గానే ఒక ఫైనల్ మీట్ తో డేట్ ని లాక్ చేసినట్టుగా రూమర్స్ వచ్చాయి. మరి ఈ డేట్ ఏంటి ఎప్పుడు రివీల్ చేస్తారు అనే అంశంపై ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ఈ భారీ సినిమా నుంచి రేపు ఆదివారం ఓ సాలిడ్ గ్లింప్స్ తో పాటుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారని బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు