“అనిమల్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ ప్రోగ్రెస్.!

“అనిమల్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ ప్రోగ్రెస్.!

Published on Jan 20, 2024 2:02 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అనిమల్”. మరి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ భారీ హిట్ అయ్యి బాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రసింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ చిత్రం థియేటర్స్ రన్ తర్వాత ఓటిటి విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఓ పక్క సినిమాకి ఉన్న కొన్ని లీగల్ కేసులతో సినిమా ఓటిటి రిలీజ్ ఆలస్యం అవుతుంది అని టాక్ ఉంది.

కానీ మరోపక్క ఇలాంటివి ఏవి ఉన్నా కూడా ఈ జనవరి 26నే ఓటిటిలో సినిమా వచ్చేస్తుంది అని స్ట్రాంగ్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనితో ఎట్టి పరిస్థితుల్లో అనిమల్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ జనవరి 26నే వస్తుంది అనేది మాత్రం ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మికా మందన్నా తదితరులు నటించగా టి సిరీస్ మరియు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు