టాక్..తారక్, చైతూల క్లాష్ ఫిక్స్!?

టాక్..తారక్, చైతూల క్లాష్ ఫిక్స్!?

Published on Mar 31, 2024 5:46 PM IST

ఈ ఏడాదిలో టాలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో దాదాపు అందరి స్టార్ హీరోస్ నుంచి ఆసక్తికర ప్రాజెక్ట్ లే సిద్ధంగా ఉన్నాయి. మరి వీటిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర” (Devara) కూడా ఒకటి.

మరి దీని కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక మరో పక్క యంగ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న తన కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “తండేల్” (Thandel) కూడా ఒకటి. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ రెండు సినిమాలు కూడా మంచి అంచనాలతో ఉండగా మొదటి నుంచి ఈ రెండు సినిమాల క్లాష్ ఉండొచ్చనే టాక్ గట్టిగా ఉంది. అయితే ఆల్రెడీ దేవర అక్టోబర్ 10న లాక్ అయ్యిపోయింది కూడా.. ఇప్పుడు తండేల్ ఆ తరువాతి రోజు అంటే అక్టోబర్ 11న వచ్చేందుకు చూస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో తారక్, చైతూల క్లాష్ ఫిక్స్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి ఈ క్లాష్ ఉందో లేదో మున్ముందు క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు