“కల్కి 2898ఎడి” రిలీజ్ పై తుది నిర్ణయానికి వచ్చిన మేకర్స్!?

“కల్కి 2898ఎడి” రిలీజ్ పై తుది నిర్ణయానికి వచ్చిన మేకర్స్!?

Published on Apr 14, 2024 2:01 PM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దిశా పటాని (Disha Patani) అలాగే దీపికా పదుకోణ్ సహా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి గ్రాండ్ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం “కల్కి 2898ఎడి”. టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా సస్పెన్స్ గా మారింది.

అయితే ఆల్రెడీ ఈ సినిమా మే 9 నుంచి వాయిదా పడినట్టు అనధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. కానీ మే 30నే రిలీజ్ ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ బయటకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై ప్రోగ్రెస్ తెలుస్తుంది. దీని ప్రకారం జరగనున్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ డేట్ ఫై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు