సంక్రాంతి సై ఫై డ్రామా ఓటిటిలో కూడా కష్టమేనా?

సంక్రాంతి సై ఫై డ్రామా ఓటిటిలో కూడా కష్టమేనా?

Published on Feb 22, 2024 10:30 PM IST

ఈ ఏడాదిలో సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా సహా తమిళ్ నుంచి కూడా పలు చిత్రాలు రిలీజ్ కి వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో తమిళ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన సై ఫై యాక్షన్ డ్రామా శివ కార్తికేయన్ కెరీర్ లో డీసెంట్ వసూళ్ళని అందుకుంది. అయితే ఈ చిత్రం తెలుగులో కూడా మేకర్స్ రిలీజ్ కి ప్లాన్ చేశారు. కానీ సంక్రాంతి బరిలో ఉన్న పోటీ నిమిత్తం తర్వాతకి వాయిదా వేశారు.

కానీ అయినా కూడా తెలుగు రిలీజ్ కి ఈ చిత్రం నోచుకోలేదు. ఇక తమిళ్ లో ఆల్రెడీ ఓటిటిలో వచ్చేసింది కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనేది కూడా సందేహమే అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు అయినా కూడా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఓటిటి రిలీజ్ పై ఎలాంటి ప్రోగ్రెస్ లేదు సో ఈ సినిమా తెలుగులో ఓటిటిలో కూడా ఇప్పుడప్పుడే రావడం కష్టమే అని చెప్పక తప్పదు. మరి దీనిపై ఎపుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు