లేటెస్ట్ : ‘పుష్ప 2’ పై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లేటెస్ట్ : ‘పుష్ప 2’ పై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Jan 19, 2024 3:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా పుష్ప 2 గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ, పుష్ప 1 భారీ విజయంతో మా మీద మరింత రెస్పాన్సిబిలిటీ ఏర్పడింది. దానిని ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ కి మంచి అవుట్ పుట్ అందించేందుకు పుష్ప 2 టీమ్ మొత్తం ఎంతగానో కష్టపడుతోందని ఆమె అన్నారు.

ఇప్పుడే పుష్ప 2 కి సంబంధించి ఒక సాంగ్ షూట్ పూర్తి చేసుకుని వచ్చాను, అది ఎంతో అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఇదొక నెవర్ ఎండింగ్ స్టోరీ అని, దీనిని మీరు గేమ్ గా గాని, అలానే పలు ఇతర విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఆనందించవచ్చని అంత అద్భుతంగా దర్శకుడు సుకుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారని అన్నారు. మొత్తంగా రష్మిక మందన్న పుష్ప 2 గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు