మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే మంచి బజ్ ని సెట్ చేసుకోగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ చిత్రం షూట్ కి సంబంధించి లేటెస్ట్ రిపోర్ట్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే మేకర్స్ ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నారట.
హైదరాబాద్, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. మంచి రిథమ్ తో కూడిన ని సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించినట్టు తెలుస్తుంది. సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో బ్యూటిఫుల్ ఎమోషన్స్ అలాగే డివోషన్ తో కూడిన సన్నివేశాలు మంచి హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
