మెగాస్టార్ ‘విశ్వంభర’లో విజయశాంతి ?

మెగాస్టార్ ‘విశ్వంభర’లో విజయశాంతి ?

Published on Apr 23, 2024 1:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని.. ఇప్పుడు ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఒప్పించే పనిలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి – విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ కుదిరితే విశ్వంభర కు ప్లస్ అవుతుంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో ‘త్రిష – చిరు’ల పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందట. అలాగే, ఈ చిత్రంలో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు