‘విశ్వంభర’ హైలైట్ సీక్వెన్స్ అదే

‘విశ్వంభర’ హైలైట్ సీక్వెన్స్ అదే

Published on Apr 29, 2024 6:55 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలోని ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీన్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీన్ లో మెగాస్టార్ చిరంజీవి రెండో క్యారెక్టర్ రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికే ఈ సీన్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. అన్నట్టు ఈ ఇంటర్వెల్ లో ఫ్యామిలీ ఎమోషన్ కూడా హైలైట్ గా ఉంటుందట.

కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో ‘త్రిష – చిరు’ల పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందట. అలాగే, ఈ చిత్రంలో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు