“స్పైడర్ మ్యాన్ 4” పై ఇంట్రెస్టింగ్ రూమర్స్.!

“స్పైడర్ మ్యాన్ 4” పై ఇంట్రెస్టింగ్ రూమర్స్.!

Published on Mar 26, 2024 3:28 PM IST

మన టాలీవుడ్ నుంచి ఒక సూపర్ హీరో సినిమాగా రీసెంట్ గా “హను మాన్” (Hanu Man) మనకి వచ్చాడు. అయితే ఈ తరహా చిత్రాలు హాలీవుడ్ ఎప్పుడు నుంచో తీస్తుండగా హాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన ఎన్నో సూపర్ హీరో పాత్రల్లో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న పాత్ర “స్పైడర్ మ్యాన్” కూడా ఒకటి. మరి దీనిపై మొత్తం ముగ్గురు హీరోస్ తో సినిమాలు రాగా వారి ముగ్గురుని కలిపి వచ్చిన సినిమానే “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” (Spiderman No Way Home).

అయితే ఈ సినిమా యంగ్ నటుడు టామ్ హోలాండ్ (Tom Holland) కెరీర్ లో మూడో స్పైడర్ మ్యాన్ సినిమా కాగా దీనికి ఇప్పుడు నాలుగో సినిమా (Spiderman 4) ఉంటుందా లేదా అనే దానిపై హాలీవుడ్ వర్గాల్లో కొన్ని ఆసక్తికర అప్డేట్స్ వైరల్ గా మారాయి. మరి దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుందట.

అలాగే మరికొన్ని రూమర్స్ ప్రకారం ఈ చిత్రాన్ని హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” (Fast and Furious) దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా హీరోయిన్ జెండాయ (Zendaya) కూడా ఈ సీక్వెల్ లో కొనసాగుతుందని టాక్. మొత్తానికి అయితే ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం చూస్తున్నవారికి ఈ అప్డేట్స్ కాస్త ఊరటనిచ్చాయి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు