లేటెస్ట్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్ ఫ్యామిలీ….కానీ ?

లేటెస్ట్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్ ఫ్యామిలీ….కానీ ?

Published on Apr 13, 2024 9:31 PM IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) త్వరలో జక్కన్న రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించనున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 లో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు మహేష్ బాబు. ఇక తమ యూరోప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు పిక్స్ ని మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితార ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

కాగా తమ వెకేషన్ పూర్తి చేసుకుని నేడు హైదరాబాద్ చేరుకుంది సూపర్ స్టార్ ఫ్యామిలీ. విషయం ఏమిటంటే, నేడు నమ్రత, గౌతమ్, సితార మాత్రమే హైదరాబాద్ చేరుకోగా మహేష్ బాబు మాత్రం యూరోప్ లోనే ఉన్నారు. అయితే ఆయన నిపుణుల ఆధ్వర్యంలో శారీరక శిక్షణ తీసుకుంటున్నట్లు టాక్. ఇక ఇప్పటికే SSMB 29 మూవీ కోసం ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతూ న్యూ లుక్ తో సూపర్ స్టార్ మహేష్ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు