“కంగువ” కి తన ఫైనల్ టచ్ స్టార్ట్ చేసిన సూర్య

“కంగువ” కి తన ఫైనల్ టచ్ స్టార్ట్ చేసిన సూర్య

Published on Feb 21, 2024 1:59 PM IST

కోలీవుడ్ విలక్షణ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కంగువ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం సూర్య ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేయగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు.

అలాగే భారీ విజువల్స్ తో ప్లాన్ చేస్తుండడంతో మేకర్స్ మంచి క్వాలిటీ వచ్చాకే సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న సూర్య ఇప్పుడు తన ఫైనల్ వర్క్ ని స్టార్ట్ చేసాడు. ఈ సినిమాకి తాను ఇప్పుడు డబ్బింగ్ పనులు అయితే స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

మేకర్స్ ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్లాన్ చేస్తుండగా సూర్య తమిళ్ సహా తెలుగు డబ్బింగ్ కూడా కన్ఫర్మ్ గా చెబుతాడు మరి మిగతా ఎన్నో భాషల్లో చెప్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు