లేటెస్ట్ : టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాతికేళ్ల ప్రస్థానం

లేటెస్ట్ : టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాతికేళ్ల ప్రస్థానం

Published on Apr 22, 2024 4:04 PM IST


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఇక తొలిసారిగా కథ, మాటల రచయితగా స్వయంవరం మూవీ ద్వారా టాలీవుడ్ లో తన కెరీర్ ని ప్రారంభించారు త్రివిక్రమ్.

ఈ మూవీ రిలీజ్ అయి నేటికి సక్సెస్ఫుల్ గా 25 ఏళ్ళు గడవడంతో పలువురు ఆడియన్స్ టీమ్ కి ప్రత్యేకంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు ఈ మూవీ ద్వారా తన సినీ కెరీర్ లో పాతికేళ్ళు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ కి కూడా అభినందనలు తెలుపుతున్నారు.

స్వయంవరం తరువాత మరికొన్ని సినిమాలకు కథ, మాటలు అందించిన త్రివిక్రమ్, ఆపైన నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి అక్కడి నుండి పలు సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకుని కొనసాగుతున్నారు. త్వరలో అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు త్రివిక్రమ్. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని మా 123 తెలుగు టీమ్ కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు