‘ఆర్ఆర్ఆర్’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 11, 2021 9:30 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా తాజాగా చిత్రబృందం నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. మేకర్స్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ రోజు స్టూడియోలో ఒక మేజిక్ జరిగింది’ అంటూ ఇన్ డైరెక్ట్ గా ఈ సినిమా నేపథ్య సంగీతం గురించి ప్రస్తావించి.. త్వరలోనే ఆర్ఆర్ఆర్ మీ ముందుకు రాబోతుంది’ అంటూ రాజమౌళి, కీరవాణితో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్.. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా బాగుంటాయట. కాగా ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :