విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తెలుగులో హీరోని ‘కథానాయకుడు’ అని.. విలన్ ని ‘ప్రతినాయకుడు’ అని పిలుస్తారు. అలాంటి విలన్ పాత్రల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదు. కళ్లల్లో క్రౌర్యం తాండవించాలి. హావభావాలతో వికటాట్టహాసం చేయాలి. అందుకు తగ్గ భీకర రూపం ఉండాలి. అలాంటి ప్రతినాయక లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి ‘నీరజ్ యాదవ్’లో. అందుకే.. భోజపురిలో లీడింగ్ విలన్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుని, హిందీలోనూ విలన్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ ఈయన స్వరాష్ట్రం. అయితే.. తాను ఏ భాషలో నటిస్తున్నా.. అక్కడివాళ్ళు తనను ‘నువ్వు తెలుగువాడివా?’ అని అడుగుతుంటారని.. తన ఫేస్ కట్స్ అలా ఉంటాయని అంటుంటారని.. అందుకే తెలుగులో విలన్ గా మెప్పించాలని ఆశ పడుతున్నానని నీరజ్ యాదవ్ చెబుతున్నారు. ఒక ప్రముఖ దర్శకుడి పిలుపు మేరకు.. ఆడిషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చిన నీరజ్ యాదవ్.. నేపాలీ, గుజరాతీ భాషల్లోనూ నటించారు. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో సాయికుమార్, షియాజీ షిండే తదితరులతో రూపొందుతున్న ఓ కన్నడ చిత్రంలోనూ నటిస్తున్న నీరజ్ యాదవ్.. సినిమాలను ప్రేమించే, ప్రతిభను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా గౌరవమని, వాళ్ళ మెప్పు పొంది తెలుగులో ‘మంచి విలన్’గా స్థిరపడాలన్నది తన కోరికని చెబుతున్నారు!!
విలన్ గా విజృంభించే అవకాశం కోసం నిరీక్షిస్తున్న నీరజ్ యాదవ్ !
విలన్ గా విజృంభించే అవకాశం కోసం నిరీక్షిస్తున్న నీరజ్ యాదవ్ !
Published on Jan 31, 2020 7:45 AM IST
సంబంధిత సమాచారం
- రెండు రోజుల్లో పోటీ.. ఆగనంటున్న నయన్..!
- మరింత ఆలస్యం కానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..?
- భాగ్యశ్రీ కి బంపర్ ఆఫర్.. నెక్స్ట్ ఆ హీరోతో ఛాన్స్..?
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- కొరియన్ కనకరాజు వివాదం.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..!
- ఈ ఫ్రైడే కొట్టేసిన ఇద్దరు ‘కనకరాజు’లూ..
- సల్మాన్ ఖాన్ -వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్‌లో జాకీ ష్రాఫ్.. కానీ ఆ రోల్ మాత్రం కాదంట!
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!


