అడివి శేష్ ‘గూఢాచారి’ కొత్త విశేషాలు !


‘క్షణం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం ‘గూఢాచారి’ అనే సినిమా చేస్తున్నాడు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే అమెరికాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను త్వరలో హిమాచల్ ప్రదేశ్ లో షూట్ చేయనున్నారు.

అందుకోసం చిత్ర యూనిట్ హిమాచల్ ప్రదేశ్ వెళ్లి సరైన లొకేషన్ల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఏ విషయంలోనూ తొదరపడకుండా కొద్దిగా ఎక్కువ సమయమే తీసుకుని అన్ని విధాలా ఖచ్చితంగా ఉండేట్టు సినిమాను రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని సుప్రియ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుండగా శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version