‘త్రివిక్రమ్’ సినిమాలో బన్నీ డ్యూయెల్ రోల్

‘త్రివిక్రమ్’ సినిమాలో బన్నీ డ్యూయెల్ రోల్

Published on Apr 29, 2024 10:31 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. బన్నీ రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లోనే అల్లు అర్జున్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివక్రమ్ మరోసారి జత కట్టారు. ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు