‘అట్లీ – అల్లు అర్జున్’ సినిమా పై కొత్త రూమర్

‘అట్లీ – అల్లు అర్జున్’ సినిమా పై కొత్త రూమర్

Published on Apr 1, 2024 6:35 PM IST

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మార్మోగిపోయింది. నిజంగా ఆ స్థాయిలోనే జవాన్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. అందుకే, ఇప్పుడు అట్లీ తర్వాత సినిమా పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తో అట్లీ సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపించాయి. పైగా, అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనగా ఏప్రిల్ 8వ తేదీన ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కూడా వస్తోందని వార్తలు వినిపించాయి.

కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై ఇప్పుడు కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించే ఛాన్స్ ఉందని సమాచారం. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమాను నిర్మించనున్నారట. బన్నీతో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కించాలని అట్లీ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు