బన్నీ- సుకుమార్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

బన్నీ- సుకుమార్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 25, 2019 12:00 AM IST

Allu sukumar

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో కొంతమంది కొత్త నటులను తీసుకోవటానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటం కారణంగా సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ ఫీల్ అవుతున్నాడట.

ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు.

‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు