ఈ స్టార్ డైరెక్టర్ బాలయ్యతో కన్ఫర్మే ?

Published on Jan 16, 2019 9:01 am IST

వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోన్నప్పటికీ ఆ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ మాత్రం సెట్ కావట్లేదని.. అందుకే సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్, బాలయ్యతో సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే తమ సినిమా ఉంటుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

వీరి కాంబినేషన్ లో గతంలో ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం వచ్చింది. మళ్ళీ 16 ఏళ్ల తరవాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వారి అంచనాలను ఈ కాంబినేషన్ రీచ్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :