నటసింహం బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఐతే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారట. ఈ షూట్ లో బాలయ్యతో పాటు మిగిలిన తారాగణం కూడా పాల్గొంటారట. అన్నట్టు ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
కాగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


