‘భ‌క్త క‌న్న‌ప్ప‌’లో హైలైట్ ఎపిసోడ్ అదే

‘భ‌క్త క‌న్న‌ప్ప‌’లో హైలైట్ ఎపిసోడ్ అదే

Published on Jan 30, 2024 7:02 AM IST

మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా భ‌క్త క‌న్న‌ప్ప‌. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్, ఇంటర్వెల్ షూట్ కి సన్నాహాలు చేసుకుంటోంది. పైగా కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ కూడా వేశారట. ఈ ఇంటర్వెల్ లోనే శివుడి పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని చెబుతున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే, ఈ ఇంటర్వెల్ కోసం టీమ్ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది.

కాగా కన్నప్ప తెలుగు వాడు. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. ఆ మధ్య ఈ ప్రాంతంలో కూడా షూట్ చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ మహా శివునిగా కనిపిస్తుంటే.. అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార కనిపించనుంది అని టాక్. అలాగే ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పై మంచు విష్ణు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మరి విష్ణుకి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు