భారతీయుడు 2 షూటింగ్ ఆలస్యం కానుంది !

Published on Dec 19, 2018 1:23 am IST

లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్ ల కలయికలో ‘భారతీయుడు 2’ తెరకెక్కనుందని తెలిసిందే. ఇక డిసెంబర్ 14న ఈచిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వచ్చిన వచ్చాయి కానీ సెట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో అది సాధ్యంకాలేదు. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్నీ సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు శంకర్ అలాగే ఈ చిత్రం కోసం యంగ్ లుక్ లో మారడానికి కమల్ ప్రస్తుతం జిమ్ లో కష్టపడుతున్నాడు.

సూపర్ హిట్ మూవీ భారతీయుడు కు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈచిత్రంలో కాజల్, నడిముడి వేణు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈచిత్రం 2020లో సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :