తెలుగు “బిగ్ బాస్” ఓటిటి కొత్త సీజన్ పై లేటెస్ట్ అప్డేట్

తెలుగు “బిగ్ బాస్” ఓటిటి కొత్త సీజన్ పై లేటెస్ట్ అప్డేట్

Published on Jan 26, 2024 8:06 AM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర సెన్సేషనల్ రియాలిటీ షో “బిగ్ బాస్” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా అందులో లేటెస్ట్ ఏడవ సీజన్ తో అయితే మళ్ళీ మునుపటిలా ట్రాక్ లోకి వచ్చింది. అయితే బిగ్ బాస్ తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఓటిటి లో కూడా మొదటి సీజన్ ని స్టార్ట్ చేశారు. అయితే ఇది వచ్చి చాలా కాలం అయ్యింది కానీ ఇది ఏమంత సక్సెస్ కాలేదు.

అయితే ఇప్పుడు ఓటిటి వెర్షన్ రెండో సీజన్ ఎప్పుడు అనే దానిపై క్లారిటీ తెలుస్తుంది. అయితే మొదటి సీజన్ సరిగా వర్క్ కాకపోవడంతో సీజన్ 2 ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి దీని విషయంలో చాలా చర్చ నడుస్తుంది కానీ ఇంకో పక్క హోస్ట్ ఎవరు అనేదానిపై కూడా చర్చ నడుస్తుందట. ఇక ఇవన్నీ క్లియర్ అయితే తప్ప అసలు ఈ సారి ఓటిటి లో రెండో సీజన్ ఉంటుందో లేదో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు